హీరోయిన్ డింపుల్‌కు షాకిచ్చిన హైకోర్టు
టాలీవుడ్ నటి డింపుల్ హయాతికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jun 2023 2:15 PM ISTహీరోయిన్ డింపుల్‌కు షాకిచ్చిన హై కోర్టు
టాలీవుడ్ నటి డింపుల్ హయాతికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను, న్యాయవాది డేవిడ్ ను పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని హై కోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వారిద్దరికీ సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మే 17న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ జి. అనుపమ చక్రవర్తి జూన్ 7న విచారించారు. ఇద్దరి తరపు న్యాయవాదుల వాదనల అనంతరం డింపుల్ ఖచ్చితంగా కోర్టు, పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయంపై మాట్లాడిన న్యాయవాది పాల్ సత్యనాధన్ డేవిడ్.. “ఇందులో పోలీసుల అత్యుత్సాహం తప్ప మరొకటి లేదని, వారి దౌర్జన్యాలను ప్రశ్నించకపోతే దానికి అంతం ఉండదని" ఆయన అన్నారు.
ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతామని న్యాయవాది పాల్ సత్యనాధన్ డేవిడ్ తెలిపారు. పార్కింగ్ సమస్యపై ఆమె ముఖాముఖిగా ఎదుర్కొన్న తర్వాత, ఆమె ప్రతిష్టను దెబ్బతీయడం, ఆమెను కటకటాల వెనక్కి నెట్టాలనే లక్ష్యంతో అధికారి నటిపై పగ పెంచుకున్నారని ఆమె తరపున లాయర్ చెబుతున్నారు. డీసీపీ ట్రాఫిక్-ఐ రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా డింపుల్ కారుతో ఢీకొట్టడంతో పాటు అధికారి, నటి నివాసం ఉండే అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో ఉంచిన ట్రాఫిక్ కోన్‌లను తన్నడంపై జూబ్లీహిల్స్ పోలీసులు హయాతి, డేవిడ్‌లపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.