వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, ఆయన జర్మనీ పౌరుడేనని కోర్టు తేల్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విచారణ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.30 లక్షల జరిమానా విధించింది. నకిలీ పత్రాలతో ఎమ్మెల్యేగా పోటీ చేసినందుకు పిటిషనర్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.5 లక్షల పరిహారం సహా రూ.30 లక్షల జరిమానాను కోర్టు విధించింది.
నెల రోజుల్లో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని పేర్కొంది. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు ఆదేశించింది. నెలరోజుల పాటు ఆర్డర్‌ను సస్పెన్షన్‌లో ఉంచాలని చెన్నమనేని రమేష్ న్యాయవాది కోరారు. జర్మనీ పౌరుడైనప్పటికీ రమేష్ భారతదేశంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారని కోర్టు పేర్కొంది.