ఇంటర్నెట్ వాడొద్దు రవి..!

ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

By -  Medi Samrat
Published on : 17 Feb 2026 6:13 PM IST

ఇంటర్నెట్ వాడొద్దు రవి..!

'ఐబొమ్మ' వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్టు చేశారు. సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించాడనే ఆరోపణలతో రవిపై ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో అతని బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు, హైకోర్టు తిరస్కరించాయి. తాజాగా మరోసారి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, కఠిన షరతులతో బెయిల్‌కు అంగీకరించింది.

పాస్‌పోర్ట్‌ను కోర్టుకు సరెండర్ చేయాలి. ప్రతిరోజూ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

Next Story