Telangana: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ కు ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయాయి.

By అంజి  Published on  15 Oct 2024 12:08 PM IST
Telangana High Court, Group 1 Mains, Group one exam

Telangana: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ కు ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయాయి. మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. కొంతమంది విద్యార్థులు ఇటీవల జరిగిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన రెండు పిటిషన్లపై ధర్మసనం విచారణ చేపట్టింది. హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేస్తూ గ్రూప్ వన్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి పరీక్షలు యథావిథిగా కొనసాగాలంటూ హైకోర్టు తీర్పు వెల్లడించడంతో టీజీపిఎస్సి ఈనెల 21వ తేదీ నుండి యథావిథిగా గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించనున్నది. మొత్తం 31 వేల 382 మంది విద్యార్థులు మెయిన్స్‌ పరీక్ష రాయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దు అయిన సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు పరీక్ష రద్దు కావడంతో తమ ప్రాణాలు తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. వీరందిరికీ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు.

Next Story