Telangana: 19 మంది గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు రూ.20 వేల జరిమానా
కోర్టును తప్పుదారి పట్టించినందుకు తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్ష అభ్యర్థులకు రూ.20,000 జరిమానా విధించింది.
By అంజి
Telangana High Court, fine, Group-1 candidates, misleading the court
హైదరాబాద్: 2024 అక్టోబర్‌లో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు హాజరై ర్యాంకు సాధించడంలో విఫలమైన 19 మంది పిటిషనర్లు/అభ్యర్థులు హైకోర్టు గౌరవనీయ న్యాయమూర్తులకు కోర్టు మాస్టర్లు, వ్యక్తిగత కార్యదర్శులకు రూ.20,000 చెల్లించాలని జస్టిస్ నగేష్ భీమకపాకతో కూడిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ సోమవారం ఆదేశించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో 19 మంది పిటిషనర్లు / విఫలమైన అభ్యర్థులపై కోర్టు ముందు 'ప్రమాణం మీద తప్పుగా సాక్ష్యం చెప్పినందుకు' ప్రాసిక్యూషన్ ప్రారంభించాలని జస్టిస్ భీమపాక రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)ను ఆదేశించారు.
పిటిషనర్లకు న్యాయమూర్తి రూ. 20,000 జరిమానా విధించడానికి గల కారణం ఏమిటంటే.. వారు పిటిషన్‌లో అభ్యర్థి హాల్ టికెట్ (హాల్ టికెట్. నం. 240920176) ను ఉదహరించారు, హాల్ టికెట్‌లో పేర్కొన్న అభ్యర్థికి సంబంధించిన మార్కులను 329.5 నుండి 192.5 కు తగ్గించారని, మూల్యాంకనం సమయంలో అవకతవకలు, వ్యత్యాసాలు జరిగాయని ఆరోపించారు.
అయితే, పైన పేర్కొన్న హాల్ టికెట్ నంబర్ ఉన్న అభ్యర్థి రిట్ పిటిషన్‌లో పార్టీ కాదని లేదా తన మార్కులు తగ్గాయని ఫిర్యాదుతో TGPSCని సంప్రదించలేదని జస్టిస్ భీమపాక ఎత్తి చూపారు. పిటిషనర్ల ఈ తప్పుడు వాదన రూ. 20,000 జరిమానా విధించడానికి, ప్రాసిక్యూషన్‌కు దారితీసింది.
అంతేకాకుండా, 19 మంది పిటిషనర్లలో ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు (రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం), వారిపై ప్రాసిక్యూషన్ ప్రారంభించడం వారి భవిష్యత్ సర్వీసులో వారికి వ్యతిరేకంగా ఉంటుంది. భారతీయ రైల్వే ఉద్యోగి కె. ముత్తయ్య, మరో 18 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తి "తోసిపుచ్చారు". వారందరూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారు, కానీ ఎంపిక జాబితాలో ర్యాంకు పొందలేకపోయారు.