కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినాష్ రెడ్డి వేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. అరెస్టు విషయంలోనూ జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు కొనసాగించవచ్చునని సీబీఐకి అనుమతిస్తూ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశించింది. విచారణ ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని స్పష్టం చేసింది.
అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు న్యాయస్థానం కొట్టివేసింది. పిటీషన్ పై తీర్పు తర్వాత కోర్టుకు ఇచ్చిన ఆధారాలను సీబీఐకి తిరిగి ఇచ్చేసింది. తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని నిలువరించాలని, విచారణకు పిలవకుండా అడ్డుకోవాలని అవినాష్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తనను విచారిస్తున్నప్పుడు ఆడియో, వీడియోల ద్వారా రికార్డు చేయకపోవడాన్ని సవాలు చేశారు.