తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు!

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉరుములతో కూడిన వర్షాలు, చల్లబడిన వాతావరణానికి తెరపడనుంది.

By -  అంజి
Published on : 6 April 2026 12:34 PM IST

Telangana Weather, Heat Wave Alert, April Summer 2026, Hyderabad Temperature, North Telangana Heat, Telangana Weatherman, Dry Spell, Summer Precautions, X Weather Updates

తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు! 

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉరుములతో కూడిన వర్షాలు, చల్లబడిన వాతావరణానికి తెరపడనుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగనుందని, ముఖ్యంగా ఏప్రిల్ 10 తర్వాత వడగాల్పులు (Heat Waves) వీచే అవకాశం ఉందని 'తెలంగాణ వెదర్‌మ్యాన్' హెచ్చరించారు. ఏప్రిల్ 10 తర్వాత ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది.

హైదరాబాద్ నగరంలో కూడా వేడి పెరగనుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 39°C నుండి 41°C మధ్య నమోదు కావచ్చు. ప్రస్తుతం పొడి వాతావరణం ప్రారంభమైంది. రాబోయే రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉంటాయి. ఉత్తర, తూర్పు తెలంగాణలో 38°C నుండి 40°C, హైదరాబాద్‌లో 37°C నుండి 38°C వరకు ఉండవచ్చు.

ప్రజలకు సూచనలు:

ఎండల తీవ్రత, వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తపడాలని కోరారు.

Next Story