సింగరేణి కార్మికులకు రూ.లక్షా 90వేల దసరా బోనస్

సింగరేణి కార్మికుల తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  20 Sep 2024 1:00 PM GMT
సింగరేణి కార్మికులకు రూ.లక్షా 90వేల దసరా బోనస్

సింగరేణి కార్మికుల తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా బోనస్‌న ప్రకటించింది. మొత్తంగా కార్మికులకు రూ.796 కోట్ల బోనస్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడి లక్షా 90వేల రూపాయల చొప్పున బోనస్ అందనుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రకటన చేశారు. ఇక గత ఏడాది కంటే రూ.20వేలు ఎక్కువ బోనసే సింగరేణి కార్మికులకు బోనస్‌గా అందింది. అలాగే సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కాంట్రాక్ట్‌ బేస్‌ ఉద్యోగులకూ బోనస్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు వారికి రూ.5వేల చొప్పున బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లు కాగా ఆ లాభాల్లో 33 శాతాన్ని ప్రభుత్వం బోనస్​ గా ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ రాష్ట్రానికే తలమానికమని అన్నారు. 2023-24 ఏడాదిలో సింగరేణి లాభం 4,701 కోట్లుంగా ఉందని చెప్పారు. అందుకే సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందుతాయన్నారు. శాశ్వత ఉద్యోగులు 41,837 మంది ఉన్నారని చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా బోనస్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. వారికి రూ.5వేల వరకు బోనస్ అందుతుందన్నారు. సింగరేణి చరిత్రలోనే ఇది నిలిచిపోతుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

Next Story