నిరుద్యోగులకు శుభవార్త.. 25 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్‌తో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఐఎన్‌సీ సిద్ధమవుతోంది.
By - అంజి |
నిరుద్యోగులకు శుభవార్త.. 25 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు!
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్‌తో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఐఎన్‌సీ సిద్ధమవుతోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సహా వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డులు ఖాళీల భర్తీకి కసరత్తు చేస్తున్నాయి.
వివిధ శాఖల్లోని ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 2 నెలల్లో 25 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. పోలీస్ శాఖలో 17 వేల పోస్టులు ఉన్నట్టు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ డీఈవో, డైట్, బీఈడీ కాలేజీల్లో లెక్చరర్లు, ఎస్‌ఈఆర్‌టీలో ఖాళీలు నింపాలని టీజీపీఎస్‌సీ సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇటీవలే గ్రూప్ -1 సర్వీస్‌లకు ఎంపికైన 563 మందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. అటు గ్రూప్ 2 సెలెక్షన్ లిస్ట్ కూడా విడుదలైంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నియామక పత్రాల పంపిణీ ఆలస్యం అవుతోంది. గ్రూప్-3 నియామక ప్రక్రియ కూడా అక్టోబర్‌లో పూర్తి చేసే ప్రక్రియలో టీజీపీఎస్సీ ఉంది. ఇది జరిగిన వెంటనే కొత్త నోటిఫికేషన్లపై దృష్టి పెట్టేందుకు టీజీపీఎస్సీ సిద్ధమైంది.
తగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను, ప్రభుత్వ స్కూళ్లల్లో టీచర్ పోస్టులు, డిప్యూటీ డీఈఓ, డైట్, బీఈడీ కాలేజీల్లో లెక్చరర్లు, ఎస్సీఈఆర్టీలో ఖాళీలను నింపాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. దీంతో పాటు ఆరోగ్య శాఖతో పాటు వ్యవసాయ శాఖ, విద్యుత్, యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. వీటన్నింటికీ నవంబరు లేదా డిసెంబరు మొదటి వారంలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.