అమ్రపాలికి మరో రెండు కీలక బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా అమ్రపాలికి మరో రెండు కీలక బాధ్యతలను అప్పగించింది.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 6:03 AM GMTఅమ్రపాలికి మరో రెండు కీలక బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్
తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిని అమ్రపాలి అంటే చాఆ మందికి తెలుసు. ఆమె ఐఏఎస్ అయిన తర్వాత చాలా మందికి రోల్‌మాడల్‌గా మారింది. ట్రెండ్‌గి తగ్గట్లుగా నడుచుకుంటూ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఆమెకు యువతలో ఎంతో క్రేజ్ ఉంది. అలాగే.. పనుల్లో కూడా అంతే కచ్చితంగా ఉంటుంది అమ్రపాలి. అయితే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా అమ్రపాలికి మరో రెండు కీలక బాధ్యతలను అప్పగించింది.
ఐఏఎస్ అధికారిని అమ్రపాలి ప్రస్తుతం హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషర్, ఐటీ అండ్ ఎస్టేట్‌తో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఎండీగా కొనసాగుతున్నారు. తాజాగా మరో రెండు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అమ్రపాలికి అప్పగించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) మేనేజింగ్ డైరెక్టర్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పటించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కారయదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం. దానకిశోర్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు.
కాగా.. ఇంతకుముందు తెలంగాణలో కలెక్టర్‌గా పనిచేశారు అమ్రపాలి. ఆ తర్వాత కేంద్రంలో కూడా విధులు నిర్వర్తించారు. ఎన్నికల తర్వాత మరోసారి తిరిగి తెలంగాణకు వచ్చేశారు. అనంతరం హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో అమ్రపాలి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె విశాఖలో విద్యాభ్యాసం అనంతరం.. 2010 యూపీఎస్సీ సివిల్స్‌లో సత్తా చాటి 39వ ర్యాంకు సాధించింది. ఆ తరక్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా కూడా పనిచేశౄరు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత డిప్యుటేషన్‌పై పీఎంవోలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు అమ్రపాలి.