Telangana: నిరుద్యోగులకు శుభవార్త.. 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి పలు ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపింది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2024 1:24 AM GMTTelangana: నిరుద్యోగులకు శుభవార్త.. 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి పలు ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంది. డీఎస్సీ సహా ఇతర ఖాళీలను భర్తీ చేస్తోంది. తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్, గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జూనియర్ కళాశాలల్లో 1654 గెస్ట్ లెక్చరర్స్ తో పాటుగా.. 449 కాంట్రాక్ట్, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు కళాశాలల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ తాత్కాలిక నియామకాలు చేపడుతోంది.
కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన 90 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా తొలగించేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. యువతలో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామనరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నామని.. వచ్చే ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.