Telangana: సర్పంచ్‌ ఎన్నికలకు ముందు ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  2 Oct 2024 2:00 PM GMT
Telangana: సర్పంచ్‌ ఎన్నికలకు ముందు ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. దీనికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ‌లాంటి స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి ముగ్గురు బిడ్డలు ఉంటే అనర్హులు అవుతారనే నిబంధన ఉండగా.. ఆ నిబంధనను తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసివేసింది. మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు.

గతంలో సర్పంచ్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్న అభ్యర్థులు పోటీ చేయడానికి అనర్హులు. అయితే సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు అవుతారు. 2019లో తీసుకువచ్చిన మున్సిపల్‌ చట్టం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉన్నా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని ప్రభుత్వం చెబుతోంది. అయితే స్థానిక సంస్థల అభ్యర్థులకు ఏ ఏ సందర్భాల్లో ఇందులో మినహాయింపులతో కూడిన వెసులుబాట్లు లభిస్తాయి అనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది.

Next Story