తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం

తెలంగాణ గవర్నర్‌ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  25 Sep 2023 9:49 AM GMT
Telangana, Governor Tamilisai,  BRS Government,

తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం

తెలంగాణ గవర్నర్‌ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. చాలా రోజులుగా రాజ్‌భవన్‌ వర్సెస్‌ ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవల ఆర్టీసీ బిల్లును సైతం గవర్నర్ వెంటనే ఆమోదం తెలపలేదు. కొన్ని సందేహాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేసుకున్న తర్వాతే ఆమోదం తెలిపారు. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపడానికి కాస్త సమయం కూడా తీసుకున్నారు. అయితే.. అంతకుముందు నుంచే బీఆర్ఎస్‌ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైని పక్కనపెట్టింది. పలు కార్యక్రమాలకు ఆహ్వానం పంపనేలేదు. దాంతో.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్‌ వార్‌ నడుస్తూనే ఉంది. తాజాగా మరోసారి బీఆర్ఎస్ సర్కార్‌కు షాక్‌ ఇచ్చారు గవర్నర్ తమిళిసై.

కేసీఆర్ సర్కార్ గవర్నర్ కోటాలో ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను తమిళిసై తిరస్కరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఎంపిక చేయడానికి అర్హతులు అడ్డొస్తున్నాయంటూ ప్రభుత్వానికి తమిళిసై లేఖను రాశారు. అభ్యర్థులు ఇద్దరూ కూడా ఎక్కడా సామాజిక సేవా కార్యక్రమాలు, సేవా విభాగాల్లో పాల్గొన్నట్లు కనిపంచలేదంటూ ప్రభుత్వానికి రాసిన ప్రత్యేక లేఖలో పేర్కొన్నారు తమిళిసై. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయొద్దని రాజ్ఆయంగంలోని ఆర్టికల్ 171(5) చెబుతోందని గవర్నర్ లేఖలో వెల్లడించారు. ఈ మేరకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫారసును తిరస్కరిస్తున్నట్లు తమిళిసై సౌందరరాజన్ వివరించారు.

గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలకు ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేస్తూ ఈ ఏడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశం తీర్మానం చేసింది. ఈ సిఫారసులపై అధ్యయనం చేసిన గవర్నర్ తమిళిసై.. తాజాగా తిరస్కరిస్తున్నట్లు లేఖ రాశారు. ఇక గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసింది. ఈ సిఫారసును కూడ అప్పట్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.

Next Story