కొత్త టీచర్లకు గుడ్‌న్యూస్‌.. నేడే పోస్టింగ్‌లు

డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభవార్త. నేడు 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నారు.

By అంజి  Published on  15 Oct 2024 6:41 AM IST
Telangana government, postings, new teachers, DSC2024

కొత్త టీచర్లకు గుడ్‌న్యూస్‌.. నేడే పోస్టింగ్‌లు

హైదరాబాద్‌: డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న వారికి శుభవార్త. నేడు 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ ఎస్‌జీటీకి ఒక హాల్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, ఇతర పోస్టులకు కలిపి మరో హాల్‌ ఏర్పాటు చేసి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

అనంతరం పోస్టింగ్‌లు కేటాయిస్తారు. పోస్టింగ్‌ వచ్చిన పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీన కొత్త టీచర్లు చేరాల్సి ఉంటుంది. పోస్టింగ్‌ల కేటాయింపు నేడు పూర్తి కానుంది. ఒకవేళ ఏమైనా మిగిలితే బుధవారం కూడా పోస్టింగ్‌ల కేటాయింపు జరుగుతుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అటు కొత్త టీచర్లు చేరిన స్థానంలో 3 నెలల కిందట బదిలీ అయి రిలీవ్‌ కాని వారు ఉంటే గత జులైలో కేటాయించిన స్కూళ్లకు వెళ్తారు. అలాంటి వారు సుమారు 7 వేల మంది ఉన్నారు.

Next Story