హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్, సెకండియర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించనున్నారని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. విద్యాశాఖను చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండడంతో ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి రిలీజ్ చేయనున్నారు.
మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల రెండో వారంలో వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో శనివారం నాడు జరిగిన సమావేశంలో ఫలితాలు విడుదలకు తేదీని ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. 3రిజల్ట్స్ వచ్చిన వెంటనే విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.