హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రెండేసి చీరల చొప్పున పంపణీ చేయనుంది. అందరికీ ఒకేరకమైన యూనిఫాం చీరలను అందజేయనుంది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది.
ఈ క్రమంలోనే నిన్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం (TGSCO) ద్వారా తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించగా, వాటి నమూనాలను సీఎం పరిశీలించారు. కాగా డిజైన్‌తో పాటు చీరలపై ఇందిరా మహిళా శక్తి పథకం లోగో ఉండనుందని సమాచారం.