Telangana: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది.

By అంజి
Published on : 14 April 2025 11:33 AM IST

Telangana government, SC classification GO

Telangana: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది. A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్‌, ఊర్దూ భాషల్లో గెజిట్‌ విడుదల చేసింది.

గ్రూప్‌-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. గ్రూప్‌-2లో మాదిగ, దాని ఉపకులాల (18)కు 9 శాతం, గ్రూప్‌-3లో మాల, దాని ఉప కులాల (26)కు ఐదు శాతం కేటాయించింది. గ్రూప్‌-1లో 1,71,625 మంది, గ్రూప్‌-2లో 32,74,377 మంది, గ్రూప్‌-3లో 17,71,682 మంది ఉన్నారు.

ఈ వర్గీకరణ ప్రకారం.. ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్‌-1లోని కులాలవారితో, అక్కడ మిగిలితే గ్రూప్‌-2, ఆ తర్వాత గ్రూప్‌-3 లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్‌ చేస్తారు.

రోస్టర్‌ పాయింట్ల విభజన ఇలా..

గ్రూప్‌-1 లోని వారికి 7వ రోస్టర్‌ పాయింట్‌, గ్రూప్‌-2లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97, గ్రూప్‌-3 లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్‌ పాయింట్లు ఉంటాయి.

Next Story