ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత..? యోచిస్తున్న ప్ర‌భుత్వం

Telangana government may take this BIG decision on restrictions.తెలంగాణ రాష్ట్రంలో కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2021 12:33 PM IST
ఈ నెల 20 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత..?  యోచిస్తున్న ప్ర‌భుత్వం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు రాష్ట్రంలో ఈ నెల 19 వ‌ర‌కు రాత్రిపూట క‌ర్ఫ్యూ, ఆంక్ష‌లు అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వం స‌డ‌లింపులు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ నెల 20 త‌రువాత లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కరోనా కేసులు తగ్గుతుండటంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు వీలుగా రోజంతా సాధారణ కార్యకలాపాలను అనుమతించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వ్య‌వ‌సాయ సీజ‌న్ వేగం పుంజుకోవ‌డంతో ఆంక్ష‌ల ఎత్తివేయాల‌ని ప్ర‌భుత్వం బావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 19 వరకు రాత్రిపూట కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలనేదానిపై ఈ నెల 20 లోపు నిర్ణయం తీసుకోవాలి. కేబినెట్‌ సమావేశం నిర్వహించి, అందులో చర్చించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. పల్లె, పట్టణ ప్రగతి పనుల పరిశీలనకు సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఈ నెల 20న మొదలు కానున్నాయి. మ‌రో వైపు ఈ నెల 21 నుంచి కేంద్ర‌ప్ర‌భుత్వం ఉచిత టీకా కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతోంది. ఈ నేపథ్యంలో 20 నుంచి లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేతకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Next Story