రూ.500కి గ్యాస్‌ సిలిండర్‌.. వారికి మాత్రమే!

తెలంగాణలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టింది.

By అంజి  Published on  24 Dec 2023 6:32 AM IST
Telangana government, gas cylinder, ration card

రూ.500కి గ్యాస్‌ సిలిండర్‌.. వారికి మాత్రమే!

తెలంగాణలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టింది. రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తంపజేయాలని సూచించినట్టు తెలుస్తోంది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా.. లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది.

అయితే రేషన్‌ కార్డు లేని అర్హులు చాలా మంది ఉన్నారని, కొత్త కార్డులు వచ్చి తర్వాత వారికి కూడా ఈ పథకం వర్తింపజేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లతో ఇవాళ కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. అయితే ఈ అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌కార్డుల సంఖ్య 89.98 లక్షలు ఉన్నాయి. 'గివ్‌ ఇట్‌ అప్‌'లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు.

Next Story