మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన కేసు ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి 2+2 గన్‌మెన్లు 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, హోంశాఖ జారీ చేయగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్థన్ రెడ్డిలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటుగా ఎమ్మెల్యేలకు ఎస్కార్ట్, ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వీడియోలో బేరాలు చేసిన వాళ్లు ప్రస్తావించిన పేర్లు దేశంలోని పెద్ద నేతలవని ఆరోపించారు. ఇప్పటికే మేం 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టాం, ఇంకో 4 రాష్ట్రాల్లో కూలగొడుతున్నాం అని చెప్పారని. తెలంగాణలో కూలగొడతాం, ఆ తర్వాత ఢిల్లీ వంతు... ఢిల్లీలో ఇప్పటికే బేరాలు అయిపోయాయి... ఆ తర్వాత ఆంధ్రలో వెంటనే కూలగొడతాం, అది ముగిశాక మా టార్గెట్ రాజస్థాన్... అక్కడ కూడా కూలగొడతాం. ఇప్పటికే రాజస్థాన్ లో 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు... అంటూ ఆ వీడియోలోని వ్యక్తులు చెబుతున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇది తెలంగాణ... మా శాసనసభ్యులు వీరోచితంగా దీన్ని బయటపెట్టారని ప్రశంసించారు సీఎం కేసీఆర్. ఈ రాక్షసుల కుట్రను బద్దలు కొట్టాలని భావించి పార్టీకి, ప్రభుత్వానికి సమాచారం అందించారు.. ఆ ముఠాను ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి, ఈ వ్యవహారమంతా బయటికి వచ్చిందని అన్నారు కేసీఆర్.