కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ-పాస్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు ప్రారంభం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం ఈ - పాస్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెచ్చింది.

By అంజి
Published on : 16 July 2025 7:35 AM IST

Telangana government, e-pass website, post-matric scholarships

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ-పాస్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం ఈ - పాస్‌ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్​ శ్రీధర్​ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి ఫ్రెష్, రెన్యూవల్‌ స్కాలర్‌షిప్‌ల కోసం సెప్టెంబర్‌ 30 వరకు కాలేజీలు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఈ నెల 1వ తేదీన ప్రారంభమైంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి telanganaepass.cgg.gov.in ను విజిట్‌ చేయండి.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త స్కాలర్​షిప్​ల దరఖాస్తులు, పాత విద్యార్థుల రెన్యూవల్​ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పాస్ స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయపడుతుంది. అర్హత ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోవడం వల్ల ప్రభుత్వ సాయాన్ని పొందవచ్చు. అప్లై చేసుకునే ముందు, అవసరమైన అన్ని సర్టిఫికెట్లను రెడీ చేసుకోవాలని, సూచనలను క్షుణ్ణంగా చదవాలని అధికారులు సూచించారు. అటు విద్యార్థుల స్కాలర్​షిప్​ల కోసం ఆయా కాలేజీలు సంబంధిత డేటాను ఈ పాస్​పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని సూచించింది.

Next Story