రాష్ట్రంలో దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. సాధారణ బదిలీల నుంచి వారికి మినహాయింపు ఇస్తూ స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 70 శాతం వైకల్యం కలిగిన ఉద్యోగులకు ఈ మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక వేళ ప్రమోషన్ వచ్చినా పని చేసే స్థానంలో కొనసాగే వీలు కల్పించింది. బుద్ధి మాంద్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగులుగా ఉంటే వారు కోరుకున్న స్థానంలోనే ఉద్యోగం చేసే అవకాశం కూడా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.