మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించడానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం విదేశీ విద్య పథకానికి ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పథకంకు ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు ఫ్లైట్ టికెట్ ఛార్జీలు ఇవ్వనున్నారు. అభ్యర్థులు డిగ్రీ లేదా బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ లేదా గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ లో పాసై ఉండాలి. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారు. విద్యార్థుల పేరెంట్స్ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదు. దరఖాస్తు దారులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పెట్టుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ యాస్మీన్ బాషా తెలిపారు.