తెలంగాణలో విద్యార్థులకు జూలైలో నాలుగు రోజులు సెలవులు
తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త అందించింది.
By Srikanth Gundamalla Published on 8 July 2024 7:03 AM ISTతెలంగాణలో విద్యార్థులకు జూలైలో నాలుగు రోజులు సెలవులు
తెలంగాణలోని ఉద్యోగులు, విద్యార్థులకు శుభవార్త అందించింది. జులైలో నాలుగు రోజుల పాటు సెలవులు దొరకబోతున్నాయి. జూలై 9, 10 తేదీల్లో రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మొహర్రం నెలను పురస్కరించుకుని జూలై 9, 10 తేదీల్లో రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది. మొహర్రం మాసంలో షియా, సున్నీ ముస్లింలు సంతాప దినాలుగా జరుపుకొంటారు. ఇది ఎప్పటి నుంచే ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండ్రోజులు సెలువు ప్రకటించింది. ఈ మేరకు శనివారమే ఉత్తర్వులను జారీ చేసింది. సోమవారం విద్యార్థులు ఒక్కరోజు బడికి వెళ్తే మంగళ, బుధ వారాలు హాలీడేస్ అన్నమాట.
కాగా.. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ముస్లింలకు మొహర్రం మొదటి నెల. వారికి విషాదాలతో ఈ నెల ప్రారంభం అవుతుంది. మొహర్రం మాసంలో పదో రోజున షియా ముస్లింలు పీర్లను ఊరేగిస్తారు. ఆరోజు హజ్రత్ ఇమాం హుస్సేన్‌ను గుర్తు చేసుకుంటూ తమ సంతాపాన్ని తెలుపుతారు. సున్నీతెగకు చెందిన ముస్లింపు ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
ఈ రెండ్రోజులే కాదు.. మొహర్ర సెలవులు కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. మొహర్రం సందర్భంగా కూడా రెండ్రోజులు సెలవులు ఉంటాయి. ఈ రెండ్రోజుల పాటు సెలవులు విద్యార్థులకు మాత్రమే కాదు.. ఉద్యోగస్తులకు కూడా వర్తిస్తాయి. జూలై 16, 17 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభత్వం. అయితే.. 16, 17 తేదీలు కూడా మంగళ, బుధవారాలే వస్తున్నాయ్. ఈ క్రమంలో ఆదివారం తర్వాత ఒక్కరోజు మళ్లీ బడికి, ఉద్యోగానికి వెళ్తే రెండ్రోజులు సెలవులు ఉండనున్నాయ్.