హైదరాబాద్: రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్‌లలో అత్యంత విషపూరితమైన గ్లైకాల్ (డీఈజీ) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది.
రెండు దగ్గు సిరప్‌లు విషపూరిత డైథిలిన్ గ్లైకాల్ (DEG) తో కల్తీ చేయబడ్డాయని డీసీఏ అధికారులు తెలిపారు.
Relife CF బ్యాచ్: LSL25160 | గడువు: 12/2026, Respifresh-TR దగ్గు సిరప్ | బ్యాచ్: R01GL2523 | గడువు: 12/2026కు సంబంధించిన సిరప్‌లను వాడొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ సిరప్‌లను వాడొద్దని, ఇవి గుజరాత్‌లో తయారు చేయబడినవని అధికారులు పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ నంబర్‌కు 1800-599-6969 కాల్ చేయాలని అధికారులు సూచించారు.
ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అధికారులు నిల్వలను తొలగిస్తున్నారు.