Telangana: దశాబ్ది ఉత్సవాలకు అంతా రెడీ.. షెడ్యూల్ ఇదే..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడులకు అంతా సిద్ధం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 1:27 AM GMTTelangana: దశాబ్ది ఉత్సవాలకు అంతా రెడీ.. షెడ్యూల్ ఇదే..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడులకు అంతా సిద్ధం అయ్యింది. అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. దశాబ్ది ఉత్సవాలు కావడంతో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతున్నట్లు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు వెల్లడించారు. పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ వేడుకలు ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ వద్ద ప్రారంభం అయ్యి.. రాత్రి 9 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ముగుస్తాయని ఆయన వెల్లడించారు. ఇక ట్యాంక్‌బండ్‌పైకి వచ్చి వేడుకలను తిలకించాలనుకునే వారు సాయంత్రం 5 గంటలలోపే చేరుకోవాలని హనుమంతరావు సూచించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు చేశామని మంత్రులు పొన్నం, జూపల్లి, ఇతర అధికారులు ెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికలు, హాజర్యే వారి కోసం అన్ని సౌకర్యాలను సిద్ధం చేశామన్నారు. ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా మస్తాబు చేశామని వారు చెప్పారు. రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశామన్నారు. వేదికపై కార్యక్రమాలను వీక్షించేందుకు పలుచోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. 80కి పైగా ఫుడ్, వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశారు.
దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్:
* ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వస్తారు. అమరులకు నివాళులు అర్పిస్తారు.
* ఉదయం 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు.
* 10 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సాయుధ బలగాల కవాతు, గౌరవ వందనాలు ఉంటాయి
* 10.15 గంటల నుంచి 10.35 వరకు బలగాల మార్చ్‌ఫాస్ట్ ఉంటుంది
* 10.38 సీఎం జగన్ ప్రసంగం.. సొనియాగాంధీ వస్తే ముందుగా ఆమె ప్రసంగం ఉంటుంది
* 11.08 గంటలకు పోలీసు, ఉత్తమ కాంటింజెంట్ల అవార్డుల ప్రదానం
* 11.25గంటలకు అవార్డులు అందుకున్నవారితో ఫొటో సెషన్ ఉంటుంది
* 11.30 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం ముగింపు
సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై జరిగే కార్యక్రమాల షెడ్యూల్:
* సాయంత్రం 6.50 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్ బండ్‌పైకి వస్తారు.
* 7 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించనున్నారు
* 7.20 గంటలకు కార్నివాల్ మొదలు
* 7.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, ఆటపాటలు
* 8.30 గంటలకు ఫ్లాగ్ వాక్.. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల
* 8.44 గంటలకు గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం
* 8.50 గంటలకు ఆకట్టుకునేలా బాణసంచా