Telangana: కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై గురువారం అక్టోబర్ 2న ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు.
By అంజి Published on 2 Nov 2023 5:34 AM GMTTelangana: కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లపై గురువారం అక్టోబర్ 2న ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కె లక్ష్మా రెడ్డి, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేటర్ మేయర్ సి పారిజాత నరసింహారెడ్డి ఇళ్లలో సోదాలు జరిగాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె భారీ మొత్తంలో నగదు నిల్వ చేసినట్లు నివేదికల ఆధారంగా నవంబర్ 2, గురువారం ఉదయం 5 గంటల నుండి ఏజెన్సీ మేయర్ నివాసంలో సోదాలు ప్రారంభించింది. పారిజాతానర్సింహారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ టికెట్‌ని ఆశించారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉండగా, ఇంట్లో నర్సింహారెడ్డి కుమార్తె, తల్లి ఉన్నారు.
అటు శంషాబాద్ దగ్గర కిచ్చెనగారి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు.‘‘మా అభ్యర్థులపై ఐటీ శాఖ దాడులు చేశారన్న విషయం తెలిసి చాలా బాధేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒకటేనని ఇది రుజువు చేస్తుంది” అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధికార ప్రతినిధి గౌరీ సతీష్ దాడులపై వ్యాఖ్యానించారు.
అక్టోబర్ 13న బీబీఎంపీ మాజీ కాంట్రాక్టర్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు రూ.42 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు నిధులిచ్చేందుకు ఈ మొత్తాన్ని బెంగళూరు నుంచి చెన్నై మీదుగా తెలంగాణకు పంపిస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష పార్టీని 'స్కామ్‌గ్రెస్' అని పిలిచారు. తెలంగాణలో వారికి ఓటు వేయవద్దని ప్రజలను కోరారు.