Telangana: పోలింగ్ రోజు సెలవు ఇవ్వకుంటే చర్యలు: వికాస్‌ రాజ్

లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  11 May 2024 1:40 PM GMT
Telangana, election,  vikas raj,  polling ,

Telangana: పోలింగ్ రోజు సెలవు ఇవ్వకుంటే చర్యలు: వికాస్‌ రాజ్ 

లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ చెప్పారు. ప్రచారానికి తెరపడిందని చెప్పారు. దాంతో.. శనివారం సయాంత్రం 6 గంటల నుంచి తెలంగాణలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వికాస్‌రాజ్‌ తెలిపారు. నలుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడొద్దని ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంపై నిషేధం ఉన్న సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఆరు గంటల నుంచి ప్రచారం చేయడానికి వీలులేని తేల్చి చెప్పారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సీఈవో వికాస్‌ రాజ్‌ చెప్పారు.

తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ కొనసాగనుంది. అయితే.. పోలింగ్ సందర్భంగా అన్ని సంస్థలు సెలవు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించామన్నారు సీఈవో వికాస్‌ రాజ్‌. తమ ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ హెచ్చరించారు.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. భద్రత సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. 160 కేంద్ర కంపెనీ బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మోహరించాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి 20వేల పోలీసు బలగాలు వచ్చాయని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్ పరిధిలో రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఉంటాయని చెప్పారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కోసం 232 కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మరోవైపు ఈవీఎలను తరలించే వాహనాలకు జీపీఎస్‌లు అమర్చామని చెప్పారు. వచ్చే 48 గంటల్లో వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్‌ చెప్పారు.

Next Story