తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
Telangana Eamcet 2021 Results Out.తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2021 12:04 PM ISTతెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ నెల 4,5,6 తేదీల్లో ఇంజినీరింగ్ 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మా కోర్సుల ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షకు 90 శాతం మంది విద్యార్థులు హాజరుకాగా.. అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థలు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే.నిజానికి ఇంటర్‌లో వచ్చిన మార్కుల వెయిటేజ్‌ను తీసుకునే వారు. కానీ కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేయడంతో ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
30 నుంచి కౌన్సెలింగ్..
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30న ప్రారంభంకానుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలన, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని చెప్పారు. మిగిలిన సీట్లను బట్టి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.