తెలంగాణలో రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 9:03 AM GMTతెలంగాణలో రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈసారి మొత్తం 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
భర్తీ చేయనున్న వాటిలో పాఠశాల విద్యకు సంబంధించి 5089 ఉద్యోగాలు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఈ సారి టీఎస్‌పీఎస్‌సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరించారు. కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామని.. సుందరంగా తీర్చుదిద్దుతున్నామని అన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇక టీచర్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు నియామకాలు చేపడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇప్పటికే భారీ సంఖ్యలో విడుదల చేశామని గుర్తు చేశారు.