డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం.. అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో
తెలంగాణలో డీఎస్సీ పరీక్షలకు సమయం ఆసన్నమవుతోంది.
By Srikanth Gundamalla Published on 16 July 2024 1:46 AM GMTDSC హాల్ టికెట్లలో గందరగోళం.. అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో
తెలంగాణలో డీఎస్సీ పరీక్షలకు సమయం ఆసన్నమవుతోంది. ఒక వైపు డీఎస్సీ వాయిదా కోరుతూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. ఇటీవల విడుదల చేసిన హాల్ టికెట్ల విషయంలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మా ఫొటో.. అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో.. సంతకాలు కనిపించాయి. దీనిపై ఆందోళన చెందిన అభ్యర్థులు విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడో పొరపాటు జరిగిందనీ.. హాల్ టికెట్ల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వహించారంటూ అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లలో గందరగోళం నెలకొనడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తప్పిదాలకు విద్యాశాఖ అధికారులు మాత్రం మరోలా చెబుతున్నారు. దీనికి విద్యాశాఖ కారణం కాదని అంటున్నారు. దరఖాస్తు చేసేటప్పుడే అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అసలు తామెలా ఫొటోలు, సంతకాలు మారుస్తామంటున్నారు. సిస్టమ్ జనరేటెడ్ హాల్ టికెట్లను తాము చూసే అవకాశమే లేదంటున్నారు. ఇక తప్పులు దొర్లినట్లు వచ్చిన అభ్యర్థులకు తక్షణే సరిచేసి న్యాయం చేస్తామని విద్యాశాఖ వివరణ ఇచ్చింది.
డీఎస్సీ నిర్వహణ మొదటి నుంచి వివాదాస్పదంలోనే ఉంది. డీఎస్సీ పరీక్ష రాసిన వారికి ప్రిపరేషన్ లేకుండా నిర్వహించడంపై అభ్యర్తులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. మరోవైపు ఇవన్నీకోచింగ్ సెంటర్లు డబ్బుల కోసం ఆందోళనలు చేస్తున్నారంటూ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. దాంతో.. వివాదం మరింత పెద్దది అయ్యింది. డీఎస్సీ సహా నిరుద్యోగులు ఇతర సమస్యలపై రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు.
హాల్‌టికెట్లలో తప్పిదాలు నెట్ సెంటర్లలో దరఖాస్తుల్లో చేసిన పొరపాట్లే కారణం అని అధికారులు అంటున్నారు. ఎక్కువ మంది ఒక్కసారిగా నెట్ సెంటర్లకు వెళ్లడ వల్ల నెట్ సెంటర్ నిర్వాహకులు ఒకరి ఫొటోకు బదులు మరొకరి పొటోలు, సంతకాలను కూడా వేరే వారికి పెట్టి ఉండొచ్చని అంటున్నారు. డిజిటల్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేశారు కాబట్టి తప్పిదాలు జరిగి ఉండొచ్చని విద్యాశాఖ అధికారులు అంటున్నారు.