Telangana: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. టైమ్ దాటితే నో ఎంట్రీ
తెలంగాణలో ఇవాళ్టి నుంచి డీఎస్సీ పరీక్షలు జరగబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 July 2024 1:36 AM GMTTelangana: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. టైమ్ దాటితే నో ఎంట్రీ
తెలంగాణలో ఇవాళ్టి నుంచి డీఎస్సీ పరీక్షలు జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే పరీక్షా సెంటర్‌కు రావాలని సూచనలు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5 వ తేదివరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ నిర్వహణ, డిఎస్సీ ప్రిపరేషన్ వ్యవధి సరిపోవడం లేదంటూ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాలేదు. ఎట్టకేలకు పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్పారు. ఈ నెల 11న హాల్‌టికెట్లను విడుదల చేశారు. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పరీక్షా హాల్‌కు ముందుగానే చేరుకోవాలని సూచిస్తున్నారు.14 జిల్లాల్లోని 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా తొలిసారి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల న ఉంచి ఉ. 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 4.30 గంటల వరకు జరుగుతాయి.పరీక్షకు 15 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్ల గేట్లను మూసివేస్తామని అధికారులు చెప్పారు.
రాష్ట్రంలో 11,062 పోస్టుల భర్తీకి సుమారు 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక, ఈ ఏడాది మొదటిసారిగా డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ఈ పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభమై ఆగస్టు 5వ తేదీ వరకు ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను ఈ నెల 11న విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నిన్న (మంగళవారం) సాయంత్రానికి 2,40,727 మంది తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. బీఈడీ అభ్యర్థులు డీఈడీ చేసి.. రెండు పేపర్లలో టెట్ అర్హత సాధించి ఉంటే ఇప్పుడు రెండు పేపర్ల పరీక్షలు ఒకే సెంటర్‌లో రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేశామన్నారు.