హరీశ్‌రావు క్లాస్ తీసుకున్నారన్న ప్రచారంపై డీహెచ్‌ స్పందన

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావుకి మంత్రి హరీశ్‌రావు క్లాస్‌ తీసుకున్నారని ప్రచారం జరిగింది.

By Srikanth Gundamalla  Published on  21 Aug 2023 4:26 PM IST
Telangana, DH Srinivas, Minister Harishrao,

 హరీశ్‌రావు క్లాస్ తీసుకున్నారన్న ప్రచారంపై డీహెచ్‌ స్పందన

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావుకి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి క్లాస్‌ తీసుకున్నారని ప్రచారం జరిగింది. కొత్తగూడెంలో 'గడప గడపకు గడల' పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా... రాజకీయ ప్రచారం చేస్తున్నారంటూ దాంతో ఆ ప్రచారం ఆపాలంటూ హరీశ్‌రావు డీహెచ్‌కు సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో డీహెచ్‌ శ్రీనివాసరావు స్పందించారు. హరీశ్‌రావు క్లాస్‌ తీసుకున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చారు.

అయితే.. కొత్తగూడెం నుంచి గడల శ్రీనివాసరావు పోటీ చేస్తారని.. టికెట్‌ ఆశిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. పైగా ఆయన ఇంటింటికి వెళ్తుండటంతో ప్రచారానికి మరింత ఊపందుకుంది. ఈ క్రమంలో హరీశ్‌రావు స్పందించి ఆరోగ్యశాఖలో ఉన్నతపదవిలో ఉన్నారని.. ఇలాంటి రాజకీయ ప్రచారాలు మానుకోవాలంటూ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే.. హరీశ్‌రావు ప్రచారాలు మానుకోవాలని చెప్పలేదని డీహెచ్‌ శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.

అయితే.. డాక్టర్‌ జీఎస్‌ఆర్ ట్రస్టు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. అందుకే కొత్తగూడెంలో ఉన్నట్లు చెప్పారు. కొత్తగూడెం ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే 'గడప గడపకు గడల' కార్యక్రమం చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తానంటే పడని కొందరు వ్యక్తులే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ నమ్మొద్దని డీహెచ్‌ శ్రీనివాసరావు కోరారు.

Next Story