సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు సాధారణ ప్రయాణికుల్లా ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 Jan 2024 6:45 PM IST
telangana, deputy cm bhatti, journey,  bus,

సామాన్యుడిలా బస్సులో ప్రయాణించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి

అప్పుడప్పుడు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సాధారణ ప్రయణికుల్లా బస్సుల్లో, రైళ్లలో కనిపిస్తుంటారు. అలా చేసి వారి సింప్లిసిటీని తెలుపుతారు. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఇదే విధంగా వ్యవహరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు సాధారణ ప్రయాణికుల్లా ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆయన్ని బస్సులో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు విమానం దిగి హైదరాబాద్‌ వచ్చే బస్సులో ఎక్కాడు. ఈ క్రమంలోనే అతను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సాధారణ ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులు బస్సుల్లో కొంత ఎక్కువే ఉన్నారు. అయినా.. ఆయన సాధారణ ప్రయాణికుడిలానే నిలబడి జర్నీ చేశారు. అయితే.. ఇదంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్‌ ఫర్‌ తెలంగాణ ట్విట్టర్‌ హ్యాండిల్ ఈ మేరకు ఈ వీడియోను ట్వీట్ చేసింది. సామాన్య వ్యక్తిలా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బస్సులో ప్రయాణం చేశారని పేర్కొంది. అధికార ఆర్భాటాలు లేకుండా వ్యవహరించడంతో ఆయన్ని ప్రశంసిస్తున్నారు. కొందరైతే ఇది కదా ప్రజాపాలన అని కామెంట్స్ పెడుతున్నారు.


Next Story