తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది.
By Srikanth Gundamalla Published on 15 Sep 2024 4:00 PM GMTతెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి విక్రమార్కకు ఆహ్వానం దొరికింది. మెక్సికోలోని మోంటిగ్రో నగరంలో సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ నోబెల్ శాంతి శిఖారాగ్ర సమావేశాలకు హాజరుకావాలని భట్టి విక్రమార్కను ఆహ్వానించారు నిర్వాహకులు. 19వ తేదీన సమావేశంలో పాల్గొనన్నారు భట్టి. "ప్రగతి కోసం శాంతి" అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ 200 వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో తెలిపారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందటంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం అందటం.. తనకు ఎంతగానో గర్వకారణమని వెల్లడించారు.
టీపీసీసీ కొచ్చ ఛైర్మన్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు అధిష్ఠానం నుంచి మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. దీనికి ఉదాహరణే మహేశ్ కుమార్ గౌడ్‌కు టీపీసీసీ పదవి దక్కడమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మహేశ్ కుమార్ గౌడ్ మరింత బలోపేతం చేస్తారని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.