తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 27,077 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,740కి చేరుకుంది. 518 మంది కరోనా బారిన నుండి కోలుకోగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో మృతుల సంఖ్య 1551కి పెరిగింది.
తెలంగాణలో ప్రస్తుతం 5,106 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,942 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 60 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 26, వరంగల్ అర్బన్‌లో 20, మల్కాజ్‌గిరిలో 15 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో కరోనా మరణాలశాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పరిమితమైంది. రికవరీ రేటు దేశ్యాప్తంగా 96.2 శాతం ఉంటే.. రాష్ట్రంలో 97.68 శాతానికి పెరిగింది.