తెలంగాణలో కొత్తగా 596 పాజిటివ్‌ కేసులు

Telangana corona cases .. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 596 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  5 Dec 2020 8:28 AM IST
తెలంగాణలో  కొత్తగా 596 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 596 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,72,719 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,470 మంది మృతి చెందారు. తాజాగా 921 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,62,751 కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,498 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 6,465 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 102 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story