ఎమ్మెల్యే రోజా కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

Telangana CM KCR phone call to Nagari MLA Roja.తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం రాత్రి చిత్తూరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 April 2021 7:59 AM IST
ఎమ్మెల్యే రోజా కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం రాత్రి చిత్తూరు జిల్లా న‌గరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో ఆమె శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నారు. డాక్ట‌ర్ల సూచ‌న‌ల మేర‌కు చెన్నై న‌గ‌రంలోని త‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు సీఎం కేసీఆర్‌. త్వరగా ఎమ్యెల్యే రోజా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే.. రోజా కుటుంబ సభ్యుల యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఎమ్మెల్యే రోజా ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్‌ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. కేసీఆర్‌ ఫోన్‌ చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం కూడా కుదుటపడాలని ఆమె ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సీఎం.. ఆయ‌న వ్య‌వ‌సాయ‌క్షేత్రంలో ఐసోలేష‌న్‌లో ఉన్నారు.


Next Story