సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక

Telangana CM KCR announces bonus of Rs 368 crore to Singareni workers. ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కార్మికులకు సీఎం కేసీఆర్‌

By అంజి  Published on  28 Sept 2022 3:18 PM IST
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా కానుక

ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) కార్మికులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. 2021-22 సంవత్సరానికి కంపెనీ లాభాల వాటాలో 30 శాతాన్ని రూ. 368 కోట్ల బోనస్‌గా ప్రకటించారు. కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. దీనికి సంబంధించి సింగరేణి చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌కు సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులను జారీ చేశారు. కార్మికులకు దసరా పండుగ కానుకగా అందజేసేందుకు ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన కార్మికులకు రూ.368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ప్రకటించడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story