Telangana: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల రాయితీపై జీవో

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా చాలా మంది వాహనదారులు తిరుగుతుంటారు.

By Srikanth Gundamalla  Published on  26 Dec 2023 4:09 PM IST
telangana, challan offer, traffic police, govt GO,

 Telangana: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల రాయితీపై జీవో

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా చాలా మంది వాహనదారులు తిరుగుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ఇలాంటివి జరుగుతుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరిగే వారు ఒక్క అవకాశం దొరికితే చాలా సిగ్నల్ జంప్‌ చేసి వెళ్లిపోవాలని చూస్తారు. ఇంకా కొందరు హెల్మెంట్ ధరించకపోవడం.. సీట్‌ బెల్టు పెట్టుకోకపోవడం వంటివి చేస్తుంటారు. అయితే.. ఇవన్నీ వాహనదారులకు చిన్న విషయాలే కావొచ్చు.. కానీ అనుకోకుండా జరిగే ప్రమాదాలు ఇవి అతిపెద్ద నష్టాన్ని మిగులుస్తాయి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలనే ప్రభుత్వం.. పోలీసులు ఫైన్లు విధిస్తున్నాయి.

అయితే.. చలాన్లు పడతాయని తెలిసినా.. చట్టం చుట్టాలు అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున చలాన్లు పేరుకుపోయాయి. సీసీ కెమెరాలు.. ట్రాఫిక్‌ పోలీసులు కెమెరాల ద్వారా విధించిన చలాన్లు చాలా పెండింగ్‌లో పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఉన్నతాధికారులు రాయితీలు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా భారీ ఎత్తున రాయితీలు ప్రకటించారు. రాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసింది.

తెలంగాణలో టూవీలర్స్‌, త్రీ వీలర్స్‌పై 80 శాతం రాయితీ ప్రకటించింది ప్రభుత్వం. ఇక కార్లకు అయితే 60 శాతం ప్రకటించగా.. ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు వాహనదారులు తమ తమ వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్ చేసుకోవాలని పోలీసులు అధికారులు సూచిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెబుతున్నారు. కాగా.. గతంలో కూడా ప్రభుత్వం ఇలానే రాయితీ ప్రకటించింది. అప్పుడు ఇంతకంటే కొంత తక్కువే రాయితీ ఇచ్చానా.. ట్రాఫిక్‌ చలాన్లు రూ.300 కోట్లు వసూలు అయ్యాయి. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో చలాన్లు వసూలు అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Next Story