సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం కేబినేట్ భేటీ

Telangana Cabinet to meet on November 29.ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి రబీ బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 7:07 AM GMT
సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం కేబినేట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో మ‌ధ్యాహ్నాం రెండు గంట‌ల‌కు సమావేశం కానుంది. ఈ స‌మావేశానికి సంబంధించిన ఏర్పాట్ల‌ను చేయాల‌ని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. క‌రోనా ప‌రిస్థితులు, ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంట‌ల సాగుపై కేబినేట్ భేటిలో చ‌ర్చించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ నుంచి రబీ బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం స్పష్టం చేయడంతో డిసెంబర్‌లో ప్రారంభం కానున్న రబీలో ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లాలని శ‌నివారం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ రైతులకు సూచించారు. విత్త‌న కంపెనీలు, మిల్ల‌ర్ల‌తో ఒప్పందాలు చేసుకునేవారు అవి ధాన్యాన్ని తీసుకుంటాయ‌నే సొంత పూచీ ఉంటేనే వ‌రిని పండిచాల‌న్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జ‌రిగేలా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అవ‌స‌రం అయితే.. కొత్త‌గా కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యం పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలం అని.. కేంద్ర నిర్ణ‌యం నేప‌థ్యంలో రైతులు అప్ర‌మ‌త్తం కావాల‌న్నారు. రెండో పంట‌గా వ‌రి సాగు వ‌ద్ద‌న్నారు. వానాకాలంలోనూ 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బియ్యానే కొనుగోలు చేస్తామ‌ని కేంద్రం తెలిపింద‌న్నారు. మిల్లింగ్ ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌య్యేలా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు బియ్యంగా మార్చి పంపిస్తేనే కొనుగోళ్ల‌కు స‌రిప‌డా స్థ‌లం ఉంటుంద‌ని తెలిపారు. సీనియ‌ర్ అధికారులు, క‌లెక్ట‌ర్లు కొనుగోలు కేంద్రాల‌ను త‌ర‌చూ సంద‌ర్శించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌న్నారు

Next Story