తెలంగాణలో మరింత పెరగనున్న బీర్ల ధరలు!

తెలంగాణలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2024 7:02 AM IST
telangana, beer rates,  increase,  september,

తెలంగాణలో మరింత పెరగనున్న బీర్ల ధరలు!

తెలంగాణలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నట్లు తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 శాతం నిర్ణయించినట్టు సమాచారం. ఈ భారం చివరకు వినియోగదారులపైనే పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల బీరుఉత్పత్తి అవుతోంది. ఆ బీరును తెలంగాణ స్టేట్ బేవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి.. మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంది. ఈ క్రమంలోనే 12 బీర్ల కేసుకి బ్రూవరీలకు టీఎస్‌బీసీఎల్‌ రూ.289 చెల్లిస్తోంది. పన్నులన్నీ కలుపుకొని కేసుకు రూ.1400 చొప్పున రిటైర్లకు విక్రయిస్తున్నార. ఇక ఆ తర్వాత ఇతర ఖర్చులన్నీ కలుపుకొని మద్యం దుకాణాల్లో వినియోగదారులకు రూ.1800 చొప్పున లభిస్తోంది.

ఒక్కో బీరునూ ప్రభుత్వం బ్రూవరీల వద్ద రూ.24.08కి కొనుగోలు చేసి రూ.116.66కి మద్యం దుకాణాలకు విక్రయిస్తోంది. వినియోదారుడి వద్దకు వచ్చే సరికి ఒక్కో బీరు ధర రూ.150 అవుతోంది. బ్రూవరీలతో ప్రభుత్వం కుదుర్చుకునే ఒప్పందం రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. గడువు పూర్తయ్యాక ధరలను సవరించి మళ్లీ రెండేళ్ల ఒప్పందాన్ని కొనసాగిస్తారు.

చివరిసారిగా రెండేళ్ల క్రితం 2022 మే నెలలో 6 శాతం చొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగినందున ఈసారి 20-2 శాతం పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ స్థాయిలో పెంచితే వినియోగదారులపై భారం ఎక్కువగా ఉంటుందని భావించిన ప్రభుత్వం 10-12 వరకూ పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఒక వేళ ఈ ధరలను పెంచితే సెప్టెంబర్‌ నుంచే అమల్లోకి వస్తుందనరి సమాచారం. ధరల పెంపు మాత్రం కేవలం బీర్ల వరకే పరిమితం కానుందని తెలిసింది.

Next Story