15 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

Telangana Assembly Sessions From March 15th. ఈనెల 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

By Medi Samrat  Published on  10 March 2021 7:10 AM GMT
Telangana Assembly Sessions From March 15th

ఈనెల 15 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈనెల 18న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. సోమవారం బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రసంగించనున్నారు. అనంతరం అదే రోజు బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేయనున్నారు. అలాగే ఈనెల 16న మాజీ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మృతికి నివాళులు అర్పించనున్నారు.

17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపనున్నారు. ఇక 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌ సన్నాహాలు ప్రారంభించింది. 18న ఉదయం 11.30 గంటలకు తెలంగాణ 2021-22 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమయంతోపాటు ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈనెల 16న జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.

17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. వేర్వేరుగా సమావేశమవుతాయి.

కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ సన్నాహాలు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. 18న ఉదయం 11.30కు తెలంగాణ 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమయంతోపాటు ఉభయ సభలను ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ నెల 16న జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే ఇప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశాల నిర్వహణ తీరుతెన్నులకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా కారణంగా గత సమావేశంలో సభ్యుల మధ్య దూరం ఉండేలా అదనపు సీట్లు ఏర్పాటు చేస్తున్నారు.
Next Story
Share it