తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 12:17 PM IST
telangana, assembly election, betting,  results,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కొనసాగుతోంది. ఒక వైపై అధికారం మరోసారి తమదే అని బీఆర్ఎస్ నాయకులు దీమా వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఎగ్జిట్‌పోల్స్‌ దాదాపుగా కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడం ఇంట్రెస్ట్‌ను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారు..? ఆయా చోట్లలో పోటీలో ప్రధాన నాయకుల మధ్య పోటీ గట్టిగా ఉండబోతుంది. దాంతో.. అక్కడక్కడ ఎవరు గెలుస్తారు..? అనే దానిపై బెట్టింగ్‌లో జోరుగా నడుస్తున్నాయి. ఇంకా కొందరు అయితే.. రాష్ట్రంలో హంగ్ వస్తుందంటూ పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో బెట్టింగ్‌లపై పోలీసుల నిఘా ఉంటుంది. దాంతో.. ఇక్కడ బెట్టింగ్‌లు నిర్వహిస్తే దొరికిపోతామనే భయంతో.. బెట్టింగ్‌ రాయుళ్లు ఇతర ప్రాంతాల్లో ఉండి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని మరికొన్ని చోట్లలో కూడా బుకీలు బెట్టింగ్ దందాను నడుపుతున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి, కేసీఆర్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే దానిపై బెట్టింగ్ జరుపుతున్నారు. అలాగే ఈటల, హరీశ్‌రావు, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, మల్లారెడ్డి సహా పలువురు నేతలు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు ఎవరిది అనేదానిపై బెట్టింగ్‌లు జోరుగా కొనసాగుతున్నాయని అర్థం అవుతుంది.

ఈ బెట్టింగ్‌లలో భాగా లక్షలు పందెం కాస్తున్నారు. అలా పెట్టిన డబ్బులు డబుల్‌ వచ్చేలా అంటే.. రూ.లక్షకు రూ.2లక్షలు అంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు బుకీలు. ఎగ్జిట్‌ పోల్స్‌ పూర్తి అయ్యాక మరింత ఎగ్జైట్‌మెంట్‌ను పెంచాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాంతో.. బెట్టింగ్‌లు కూడా జోరందుకున్నాయి. పలు యాప్ ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ బెట్టింగుల నిర్వహణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బెట్టింగ్‌ల గురించి అనుమానం వచ్చిన పోలీసులు వీటిపై నిఘా పెట్టింది.

Next Story