ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ (58) అనారోగ్యంతో చనిపోయారు.
By Srikanth Gundamalla Published on 29 Jun 2024 1:19 PM ISTఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. మరో రాజకీయ నేత కూడా శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ (58) అనారోగ్యంతో చనిపోయారు.
శుక్రవారం అర్ధరాత్రి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని ఉట్నూర్‌లోని నివాసం నుంచి జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ ఆయన పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు రమేశ్ రాథోడ్. కాగా.. ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఎంపీగా కూడా రమేశ్ రాథోడ్ సేవలు అందించారు. టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఆయన పనిచేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయన భార్య సుమన్ రాథోడ్‌ను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నారు. రమేశ్ రాథోడ్ స్వస్థలం నార్నూర్ మండలం తాడిహాత్నూర్. కాగా.. రమేశ్ రాథోడ్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.