తెలంగాణలో కాలేజీల బంద్‌పై సస్పెన్స్‌.. నేడు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌!

ప్రైవేట్‌ కాలేజీల బంద్‌ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

By -  అంజి
Published on : 15 Sept 2025 6:27 AM IST

college bandh , Telangana, Dy CM Bhatti, Fee reimbursement

తెలంగాణలో కాలేజీల బంద్‌పై సస్పెన్స్‌.. నేడు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌!

హైదరాబాద్‌: ప్రైవేట్‌ కాలేజీల బంద్‌ వ్యవహారంపై నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అయితే బంద్‌పై కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గిట్లేదని తెలుస్తోంది. కళాశాలల మూసివేతను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించలేదు. దీంతో బంద్‌పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అన్ని కాలేజీలు మూసివేస్తామని ఈ భేటీకి ముందు యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అటు ప్రైవేటు కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చించారు. చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు.

సమస్యలు అర్థం చేసుకున్నామని, నేడు ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరామని చెప్పారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అటు బంద్‌ నిర్ణయంలో కాలేజీలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి చర్చలు జరగనున్నాయి. రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయకపోతే సెప్టెంబర్‌ 15 నుంచి ఇంజినీరింగ్‌ కాలేజీలు బంద్‌ చేస్తామని ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హయ్యరర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఇప్పటికే ప్రకటించింది.

Next Story