సిమెంట్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం, కార్మికుడు మృతి, ఇద్దరికి గాయాలు

సూర్యాపేట జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

By Srikanth Gundamalla
Published on : 25 July 2023 2:54 PM IST

Suryapet, Cement Factory, Lift Collapse, 5 Dead,

సిమెంట్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం, కార్మికుడు మృతి, ఇద్దరికి గాయాలు 

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంపెనీ నూతనంగా నిర్మిస్తున్న యూనిట్ 4 ప్లాంట్ వద్ద కాంక్రీట్‌ లిఫ్ట్‌ కూలి అక్కడికక్కడే ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు వద్ద ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. భవనం నిర్మాణంలో భాగంగా కాంక్రీట్‌ను గ్రౌండ్‌ ఫ్లోర్ నుంచి ఆరో ఫ్లోర్‌కు తీసుకెళ్తుండగా లిఫ్ట్‌ కిందపడిపోయింది. లిఫ్ట్‌ ఒక్కసారిగా కింద ఉన్న పలువురు కార్మికులపై పడిపోయింది. దాంతో.. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు మిగతా కార్మికులు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

క్షతగాత్రులు ఉత్తర ప్రదేశ్, బీహార్ కు చెందినవారుగా తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు లో సిమెంట్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే లిఫ్ట్ ఒక్కసారిగా కూలి పైనుండి కింద పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

Next Story