ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన వాణీదేవి
Surabhi Vani Devi was sworn in as MLC.దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురు సురభి వాణి దేవీ పట్టభద్రుల
By తోట వంశీ కుమార్ Published on
29 Aug 2021 7:59 AM GMT

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు కూతురు సురభి వాణి దేవీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఛాంబర్ లో ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేశారు వాణీదేవి. ఆమె చేత ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేకే కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
గత మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి సురభి వాణిదేవీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై విజయం సాధించారు. వాణీదేవికి 1,89,339 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు వచ్చాయి.
Next Story