ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని

By అంజి  Published on  13 March 2023 2:30 PM IST
Supreme court , MLAs poaching case

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో విచారణ జరుపుతామని తెలిపింది. మిస్‌ లేనియస్‌ పిటిషన్‌ కింద విచారణ జరుపుతామని, అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టును తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సీబీఐకి విచారణ అప్పగించడంపై స్టే ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం.. తదుపరి విచారణను జులై 31 వ తేదీకి వాయిదా వేసింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత సంవత్సరం డిసెంబర్‌ 26న ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ.. తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జీ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పును.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కూడా సమర్థించింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఫిబ్రవరి 7న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Next Story