ఎంసెట్‌లో క్వాలిఫై కాలేదని.. విద్యార్థిని ఆత్మహత్య
Student commits suicide in nalgonda.ఇటీవల కాలంలో యువత క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2021 3:58 AM GMTఇటీవల కాలంలో యువత క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అమ్మ కొట్టిందనో, నాన్న తిట్టాడనో, తాము ప్రేమించిన వారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ విద్యార్థిని ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్థాపంతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కనగల్ మండలంలోని శాబ్థుల్లాపురం గ్రామంలో కోయ రవీందర్ రెడ్డి, అరుణ దంపతులు నివసిస్తున్నారు. వీరికి స్నేహారెడ్డి(17) కూతురితో పాటు ఓ కుమారుడు సంతానం. అరుణ ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోండగా.. రవీందర్ రెడ్డి వ్యవసాయం. కాగా.. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలకు స్నేహారెడ్డి హాజరైంది. బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో స్నేహారెడ్డి అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైంది.
తల్లి విధుల నిమిత్తం బయటకు వెళ్లగా.. అమ్మను తీసుకురామ్మని తమ్ముడిని స్నేహా బయటకు పంపించింది. అనంతరం స్నేహా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కాగా.. అదే సమయంలో ఆమె తండ్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చినప్పటికి.. ఇంట్లోకి వెళ్లకుండా బయటనే కూర్చుండి పోయాడు. అంతలోనే స్నేహా తమ్ముడు తల్లిని తీసుకొని వచ్చాడు. అందరూ ఇంట్లోకి వెళ్లి చూడగా.. స్నేహా అప్పటికే కొన ఊపిరితో ఫ్యానుకు వెళాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకి దించినప్పటికీ ఆలస్యం కావడంతో స్నేహా ప్రాణాలను విడిచింది.
అమ్మా.. న్నాన నన్ను క్షమించండి మీకు నా ముఖం చూపించలేను. మీరు నామీద పెట్టుకున్న ఆశలు అడి ఆశలయ్యాయి. నేను మాట నిలబెట్టుకోలేకపోయిన .. మిమ్మల్ని వదిలివెళుతున్నా నన్ను క్షమించండి అంటూ స్నేహా సూసైడ్ నోటు రాసింది.